క్రైమ్/లీగల్

ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అనర్హత వేటుతో ఖాళీ అయిన మూడు శాసనమండలి స్థానాలకు జూన్ 3వ తేదీ వరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది. రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతిరెడ్డిల శాసనమండలి సభ్యత్వం రద్దు వ్యవహారంపై హైకోర్టులు గురువారం నాడు విచారణ జరిగింది. ఈ ముగ్గు రూ కాంగ్రెస్‌లో చేరినట్టు ఆధారాలు, ఇతర రికార్డులు సమర్పించి వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు న్యాయస్థానాన్ని కోరారు. అదనపు ఏజీ వాదనతో అంగీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోన వేసవి సెలవుల బెంచ్ విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. జూన్ 3 వరకూ ఆ మూడు స్థానాల్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వొద్దని మ ధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ముగ్గురు ఎమ్మెల్సీల తరఫున వాదనలు ముగిశాయి. పిటీషనర్ తరఫున కూడా వాదనలు ముగిశాయి. తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎమ్మెల్సీల తరఫున న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ తమ వాదనలు ఇప్పటికే వినిపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని మర్యాద పూర్వకంగా మాత్రమే కలిశారని దీనిపై తప్పుడు కథనాలు వచ్చాయని పిటీషనర్ తరఫున సల్మాన్ ఖర్షిద్ వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వం తరఫున గురువారం నాడు అదనపు అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించారు.