క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాలో బుధవారం అర్ధరాత్రి, గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గుడివా డలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా, జగ్గయ్య పేట సమీపంలోని చిల్లకల్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు అసువులు బాసారు. అలాగే ఈ ప్రమాదాల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
*
గుడివాడ/జగ్గయ్యపేట రూరల్, మే 16: పట్టణంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలాల్లోనే దుర్మరణం పాలవగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయం సెంటర్లో ఉన్న శ్రీలేఖ హోటల్‌లో సప్లయిర్‌గా పనిచేస్తున్న చుక్కా సింహాచలం(45) కుటుంబం కైకలూరులో ఉంటోంది. సింహాచలం తన కుమారుడి స్నేహితుడైన నాగేంద్రబాబు బైక్‌పై గురువారం కైకలూరు బయలుదేరారు. బైపాస్ రోడ్డులోని షాదీఖానా సమీపంలో వీరి బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. పక్కనుండి వెళ్తున్న లారీ వెనుక టైర్లు తగిలి సింహాచలం అక్కడికక్కడే మృతి చెందగా నాగేంద్రబాబు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. సింహాచలం మృతదేహాన్ని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే బుధవారం రాత్రి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన రైతు వేములపల్లి ఈశ్వరరావు మృతి చెందారు. ఈశ్వరరావు తన అల్లుడు మందా కిషోర్‌ను గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నుండి అంగలూరుకు స్కూటర్‌పై తీసుకువెళ్తుండగా ఎదురుగా వస్తున్న మారుతీ స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఈశ్వరరావు మృతదేహాన్ని స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కిషోర్‌కు ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన వైద్యసేవల నిమిత్తం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు కేసులనూ టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి
జగ్గయ్యపేట రూరల్: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై చిల్లకల్లు ఫ్లైఓవర్ పై గురువారం ఉదయం కారు ఢీకొని ఇద్దరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందగా ఒక కార్మికురాలు తీవ్రంగా గాయపడింది. చిల్లకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీఎంఆర్ సంస్ధకు చెందిన నలుగురు మహిళా పారిశుద్ధ్య కార్మికులు తమ విధుల్లో భాగంగా హైవే ఫ్లైఓవర్‌పై రోడ్లు శుభ్రం చేస్తుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న కారు అతివేగంగా వీరి మీదకు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మండలంలోని గండ్రాయి గ్రామానికి చెందిన పిల్లి మంగతాయమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందింది. ఖమ్మం జిల్లా వల్లభి గ్రామానికి చెందిన పాశం ఉషారాణి ఎలియాస్ జిన్ని (35) ఈ సంఘటనలో ఫ్లైఓవర్ పై నుండి కింద రోడ్డుపై పడటంతో బలమైన గాయాలై జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉడుసు ఉమా అనే కార్మికురాలుకు కాలు విరగడంతోపాటు పాటు తీవ్ర గాయాలు కావడంతో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, నందిగామ డీఎస్‌పీ బోసు, జగ్గయ్యపేట సీఐ అబ్దుల్ నబీలు ప్రమాద స్థలాన్ని, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వివరాలు తెలుసుకోవడంతో పాటు మృతుల బంధువులను పరామర్శించారు. చిల్లకల్లు ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేశారు.