క్రైమ్/లీగల్

కోర్టు ఉత్తర్వులు బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, మే 19: ఆర్మీ డిపో సమీపంలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టరాదని జమ్మూ-కాశ్మీర్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక బీజేపీ నేత నిర్మల్ సింగ్ కుటుంబీకులు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. జమ్మూ నగర శివారులో ఉన్న ఆర్మీ డిపోకు అత్యంత సమీపంలో నిర్మల్ సింగ్ కుటుంబీకులు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో తలెత్తిన వివాదం కోర్టు వరకు వెళ్లింది. గత ఏడాది మే 7న ఈ నిర్మాణాలను ఆపేయాలని స్టేటస్‌కో అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. డిపో సమీపంలో నిర్మాణం చేపట్టడం చట్టవిరుద్ధమంటూ ఆర్మీ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. భద్రతాపరమైన కీలక అంశాలతో కూడిన వివాదం కాబట్టి భవనాల నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించరాదని హైకోర్టు తేల్చిచెప్పింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఎక్కడిపనులు అక్కడే నిలిపివేయాలని ఆదేశించింది. అయితే, ఆర్మీ డిపోకు సమీపంలో రెండువేల సంవత్సరంలో హిమగిరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మల్ సింగ్ 2వేల గజాల భూమిని కొనుగోలు చేశారు. ఈ సంస్థలో జమ్మూ-కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా, బీజేపీ ఎంపీ జుగళ్ కిశోర్ కూడా భాగస్వాములే. ఇటీవలే తాను కంపెనీకి రాజీనామా చేశానని కవీందర్ గుప్తా ప్రకటించారు. ఇలావుంటే, వివాదాస్పద ప్లాటులో నిర్మల్ సింగ్ చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని ఆర్మీ అధికారులు అడ్డుకున్నారు.
భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేయరాదని వారు స్పష్టం చేశారు. కానీ, నిర్మల్ సింగ్ కుటుంబీకులు ఆర్మీ సూచనలు పాటించకపోవడంతో కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిర్మాణాలను కొనసాగించడం ఇపుడు చర్చనీయాంశమైంది.