క్రైమ్/లీగల్

ఆర్థిక ఇబ్బందులతో కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, మే 19: ఆర్థిక సమస్యలు చుట్టుమట్టడంతో మానసికంగా కృంగిపోయన ఒక వ్యక్తి క్షణికావేశంలో తన కుమారుడిని గొంతు నులిమి చంపి తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన కుటుంబంలోని విజయ్ (36) అనే వ్యక్తి, తన కొడుకు దినేష్ (4)ను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ముప్కాల్ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విజయ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కొంతకాలం క్రితం ముప్కాల్ మండల కేంద్రానికి వలస వచ్చి జీవనం వెళ్లదీస్తున్నాడు. అయితే వ్యాపారంలో నష్టం చవిచూడటం, దానికి ఆర్థిక ఇబ్బందులు తోడుకావడంతో విజయ్ మానసికంగా కృంగిపోయాడు. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం క్షణికావేశంలో తన నాలుగేళ్ల కుమారుడైన దినేష్ గొంతు నులిమి హతమార్చిన తర్వాత, తాను సైతం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్యతో పాటు కొడుకు విక్రం, కూతురు స్వీటీ ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు. కాగా, ఆర్మూర్ ఏసీపీ రాములు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. తండ్రీకొడుకుల మృతితో మండల కేంద్రంలో విషాదఛాయలు అలముకున్నాయి.