క్రైమ్/లీగల్

కమల్ హాసన్‌కు ముందస్తు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురై, మే 20: వివాదస్పద వ్యాఖ్య చేసి ప్రజల ఆగ్రహానికి గురై, పోలీసు కేసును ఎదుర్కొంటున్న మక్కల్ నీదీ మాలం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్‌కు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, నేరస్తునికి మతం లేదా జాతితో పోలిస్తే ప్రజల్లో విద్వేషాలు పెరుగుతాయంటూ కోర్టు కమల్ హాసన్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. అరవకురిచిలోని జ్యూడిషీయల్ మెజిస్ట్రేట్ ముందు హాజరై, రూ.10 వేల బెయిల్ బాండ్‌ను, ఇద్దరు సాక్షులను తీసుకెళ్ళాలని మధురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ పి. పుగలేంధీ ఆదేశించారు.
ఇలాఉండగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ అరవకురిచిలో ఏర్పాటైన ఊరేగింపు సభలో కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత మొదటి ఉగ్రవాది హిందువేనని, అప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో కమల్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా హిందువులు, బీజేపీ నేతలు నిరసన ప్రదర్శనలు జరిగాయి. అంతేకాకుండా కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కమల్ ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ, తమిళనాడులో కేసులు
ఇలాఉండగా కమల్ హాసన్ వ్యాఖ్యలపై హిందువులు, బీజేపీ నేతలు, వివిధ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కమల్‌పై తమిళనాడు, ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. ఒక దీపం వెలుతురును ఇస్తుంది, అదే మంట మొత్తం అడవిని దగ్ధం చేస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ, ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏదీ అవసరం అనేది చెప్పాలన్నారు. అట్టడుగున ఉన్న పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలే తప్ప ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టరాదని న్యాయమూర్తి అన్నారు. ఇప్పటికే అమాయక పేద ప్రజలు విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి పరిస్థితులను బట్టి నేరస్థునిగా మారుతాడే తప్ప పుట్టుకతోనే నేరస్థుడు కాదని వ్యాఖ్యానించారు.