క్రైమ్/లీగల్

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన రవిప్రకాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటీషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది ఈ పిటీషన్‌ను దాఖలుచేశారు. దీనిపై 22న విచారణ జరిగే అవకాశం ఉందని తెలిసింది. కాగా ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించి అత్యవసరంగా తన పిటీషన్‌ను విచారించాలని లంచ్ మోషన్‌లో కోరగా, దానిని హైకోర్టు తిరస్కరించింది. కాగా మరో పక్క నిధుల మళ్లింపు, ఫోర్జరీ కేసుల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులకు హాజరుకాకుండా రవిప్రకాష్ అజ్ఞాతంలో ఉన్నారు. దాంతో రెండు నోటీసులకు హాజరుకాని రవిప్రకాష్‌పై పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.