క్రైమ్/లీగల్

కాకినాడలో బ్రిటిష్ కాలంనాటి తుపాకులు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మే 20: బ్రిటీష్ సైనికులు మొదటి, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో ఉపయోగించిన తుపాకులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లభ్యమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి టూటౌన్ సీఐ నాగమురళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నగరం అశోక్‌నగర్ ప్రాంతంలో నూతనంగా ఓక నిర్మాణ సంస్థ రెసెడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. భవన నిర్మించేందుకు అవసరమైన గోతులు తీస్తుండగా సుమారు పది అడుగుల లోతులో పది తుపాకులు లభ్యమయ్యాయి. కార్మికులు ఈ విషయాన్ని భవన నిర్మాణ యజమానులకు తెలపగా వారు టూటౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలిసిన వెంటనే సీఐ నాగమురళి హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని తుపాకులను పరిశీలించారు. ఆ తుపాకులు 1939నుండి 1945 సంవత్సరాల మధ్య మొదటి, రెండవ ప్రపంచయుద్ధ సమయంలో వినియోగించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ తుపాకుల పేరు మార్న్-1 303 సీరీస్‌కు చెందినవని సీఐ నాగమురళి పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకుని సీఐ నాగమురళి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిటీష్ పాలన సమయంలో అప్పటి సైన్యం స్థానిక అశోక్‌నగర్ ప్రాంతంలో స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉండేవారని, వారు తుపాకులను మరచిపోయి ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

చిత్రం..కాకినాడలో పోలీసులు స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ కాలంనాటి తుపాకులు