క్రైమ్/లీగల్

భగ్గుమన్న బీరు బాటిళ్ల లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల రూరల్, మే 20: ఎండ వేడికి బీర్ బాటిళ్ల లోడుతో ఉన్న లారీ తగులబడింది. ఎండ వేడికి ఇంజన్‌లో చెలరేగిన మంటలకు లారీ మొత్తం తగులబడింది. హైదరాబాద్ నుంచి నంద్యాల పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్లకు సరఫరా చేసేందుకు లారీ (ఏపీ 21 టీడబ్ల్యు 9242)లో నాకౌట్ బీరు బాటిళ్ల లోడు తీసుకువచ్చారు. నంద్యాల సమీపంలోని ఆర్టీవో కార్యాలయం వద్దకు రాగానే అధిక ఉష్ణోగ్రత వల్ల ఒక్కసారిగా లారీ ఇంజన్ నుండి మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకాడు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపు చేసేలోగా లారీ, అందులోని సరుకు సైతం కాలిపోయింది. తాలూకా సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐలు రాజారెడ్డి, తిమ్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.