క్రైమ్/లీగల్

ముగ్గురు రౌడీషీటర్ల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఫిబ్రవరి 9: పట్టపగలు కత్తులతో దాడిచేసిన సంఘటనలో ఒకరు మృతి చెందడంతో ముగ్గురు రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.వివరాలను పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఏ.వెంకటేశ్వర్ రావు శుక్రవారం విలేఖర్లకు వెల్లడించారు. బంజారాహిల్స్ సయ్యద్ నగర్ ప్రాంతానికి చెందిన సర్పోద్దిన్ (36) హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పస్టు ల్యాంసర్‌లో కారు మెకానిక్ షేడ్ నడిపిస్తున్నాడు. జనవరి 31న మధ్యాహ్నం రెండు గంటల ప్రాం తంలో బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన అర్షద్, ఫిర్ధోష్, హజర్, సిరాజ్ నలుగురు కలిసి సర్పోద్దిన్‌తో గొడవపడి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సర్పోద్దిన్ అక్కడికక్కడే మృతి చెందగా, మృతిని బంధువు కూడా కత్తిపోట్లకు గురయ్యాడు. హర్షత్ గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్. ఇతనిపై 16 కేసులు ఉన్నాయని తెలిపారు. మహ్మద్ ఫిర్దోష్ బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో రౌడీ షీటర్ ఇతనిపై 28కేసులు ఉన్నాయి, కాగా హజర్ పంజగుట్ట పిఎస్ పరిధిలో మూడు కేసులు ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. అయితే వీరిలో ఫిర్దోష్ 2014లో పిడి యాక్ట్‌లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కాగా జనవరి 31న సర్పోద్దీన్‌తో వీరు గొడవ పడి అతనిపై కత్తులతో దాడి చేసి హాత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో హత్య చేసిన నిందితులు అప్పటి నుంచి పరారిలో ఉన్నారు. కాగా గురువారం రాత్రి ఈ రౌడీషీటర్లును హుమయూన్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. హర్షద్, ఫిర్దోష్, హజర్‌ను రిమాండ్‌కు తరలించగా, సిరాజ్ పరారీలో ఉప్నట్టు డీసీపీ పేర్కొన్నారు.