క్రైమ్/లీగల్

సుపారీ ముఠా లీడర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మే 21: కేసముద్రంలో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న సుపారీ ముఠా లీడర్, మాజీ నక్సలైట్ షేక్ అలియాస్ బాబా ఖాదర్‌ను మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా దమ్మపేటకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసేందుకు 15 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకొని ఆయుధాలను కొనుగోలు చేసి కేసముద్రంలో ఓ చింత చెట్టు కింద హత్యకు ప్రణాళిక రచిస్తున్న తరుణంలో పోలీసులకు సమాచారం రావడంతో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి మూడు ఆయుధాలను, 3 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకోగా షేక్ పారిపోయాడన్నారు. ఈ క్రమంలో షేక్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా, మంగళవారం కేసముద్రం రైల్వేస్టేషన్ వద్ద దొరికాడన్నారు. ఇతని నుంచి 12 బోర్ తుపాకి, రెండు రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. చాకచక్యంగా వ్యవహరించి సుపారి ముఠాను అరెస్టు చేసిన కేసముద్రం ఎస్‌ఐ సతీష్, మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం, సిబ్బందికి రివార్డుకు ప్రతిపాదిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

చిత్రాలు.. 12 బోర్ తుపాకిని చూపుతున్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి,
*ఇన్‌సర్ట్‌లో సుపారీ ముఠా లీడర్ షేక్