క్రైమ్/లీగల్

బాందీపుర రేప్ కేసులో త్వరలో చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 22: బాందీపుర రేప్ కేసులో త్వరలోనే చార్జిషీట్ దాఖలు కానుంది. ఉత్తర కాశ్మీర్‌లోని బాందీపుర జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన తాహిర్ అహ్మద్ మీర్‌ను పోలీసులు ఇది వరకే అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనేగాక, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిందితుడిని తక్షణమే ఉరితీయాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగాయి. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.