క్రైమ్/లీగల్

రవిప్రకాశ్‌కు మళ్లీ చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు మరోమారు హైకోర్టులో చుక్కెదురైంది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బుధవారం నాడు జరిగిన వాదనలకు రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా హాజరయ్యారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తుండగా పోలీసులు రవిప్రకాశ్‌పై అక్రమంగా కేసుపెట్టారని రవిప్రకాశ్ న్యాయవాది వాదించారు. ఒకే వ్యక్తిపై మూడు చోట్ల వేర్వేరు కేసులు నమోదు చేశారని అన్నారు. రవిప్రకాశ్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ముందస్తు బెయిల్ మంజూరుచేయాలని అహ్లువాలియా కోరారు. ఇప్పటికే రవిప్రకాశ్ పోలీసుల విచారణకు హాజరుకావాలని రెండు సార్లు 160సీఆర్‌పీసీ నోటీసులను జారీ చేశామని ప్రభుత్వ న్యాయవాది చెప్పా రు. 160 సీర్‌పీసీ నోటీసులకు స్పందించకపోవడంతో 41 ఏ నోటీసులు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. వాట్సప్‌కాల్‌లో అందరితో రవిప్రకాశ్ టచ్‌లో ఉంటున్నారని, కానీ పోలీసుల విచారణకు మాత్రం హాజరుకావడం లేదని ఆయన చెప్పారు. తాము రవిప్రకాశ్‌ను అరెస్టు చేస్తామని ఎక్కడా చెప్పలేదని, పోలీసుల విచారణకు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చామని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం రవిప్రకాశ్ పిటీషన్‌ను కొట్టివేసింది.
కోర్టులనూ తప్పదోవ పట్టిస్తారా?
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కొత్త యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు కేసులు బనాయించారంటూ రవిప్రకాశ్ విడుదల చేసిన వీడియోపై యాజమాన్యం తీవ్రం గా స్పందించింది. తాము చేసిన ఫిర్యాదులు తప్పు అయితే పోలీస్ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అడిగారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించింది. టీవీ 9 సంస్థకు చెందిన లోగోను తన సొంతమనడంపై కొత్త యాజమాన్యం కనె్నర్ర చేసింది. ఏబీసీఎల్ సంస్థలో మెజార్టీ వాటా లేకున్నా పెత్తనం చెలాయించడానికి రవిప్రకాశ్ ప్రయత్నించాడని సంస్థ గుర్తు చేసింది. తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావని నిలదీశారు.