క్రైమ్/లీగల్

ఇటుకల లారీ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మే 22: రాయదుర్గం పోలీసు పరిధిలోని ఖాజగూడ చౌరస్తాలో ఇటుకల లారీ.. స్కూల్ బస్సు ను ఢీకొట్టి బీభ త్సం సృష్టించింది. ఆ సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు లేకపోవడతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఉదయం 7.30 గంటల సమయంలో సంగారెడ్డి నుండి రాయదుర్గం వైపు ఇటుకలతో వస్తున్న లారీ వేగంగా వచ్చి అటుగా వెళ్తున్న చిరాక్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఇటుకలు ఎక్కువ ఉండడంతో ఒకవైపునకు ఒరిగిపోయి అదుపు తప్పి స్కూల్ బస్సును ఢీకొట్టింది. లారీ టైరు రోడ్డు పక్కన ఉన్న నాలా గోడపైకి ఎక్కి ఆగిపోయింది. స్కూల్ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శంకర్‌మట్, డీడీ కాలనీల నుంచి విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళ్తున్న స్కూల్ బస్సుపై లారీ ఒరిగి పడిపోయింది. లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.