క్రైమ్/లీగల్

భార్య ఎదుటే భర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 22: భర్త కళ్లెదుటే భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్ నగర్‌లో నివసిస్తున్న సీహెచ్.యాదయ్య (55) కూలీ పని చేస్తుండేవాడు. భార్య నిర్మల, ఇద్దరు పెళ్లైన కూతుర్లు ఉన్నారు. కూతుర్లు అత్తింటివారిలో ఉండగా ప్రస్తుతం ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య ఏమి జరిగిందో, భార్య కళ్లెదుటే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయరామ్ తెలిపారు.