క్రైమ్/లీగల్

అలంకరణ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మే 22: మాదాపూర్‌లోని అలంకరణ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో రూ.60లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని వాపోయాడు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్‌లోని పల్లవి ఎన్‌క్లెవ్‌లో సతీష్ అనే వ్యక్తి రేకులతో గోడౌన్ ఏర్పాటు చేసుకుని అందులో వివాహ అలంకరణ సామా గ్రి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గోడౌన్ వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఫైబర్, థర్మకోల్ వస్తువులు అధికంగా ఉండడంతో క్షణాల్లో మంటులు భారీగా చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ గంట సేపటి వరకు మంటులు అదుపులోకి రాలేదు. స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. గోడౌన్ వెనుక భాగంలో ఉన్న చెత్త అంటుకొని మంటులు వ్యాపించాయా, లేదంటే షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో రూ.60 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు గోడౌన్ యజమాని సతీష్ తెలిపారు.