క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన గుర్రంపోడు ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, మే 22: నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ఎస్‌ఐ డి.క్రాంతికుమార్ భూతగాదాల నేపధ్యంలో బాధిత రైతు నుండి హోంగార్డు ద్వారా 40వేలు లంచం తీసుకుని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన రైతు తుమ్మలూరు వెంకట్‌రెడ్డి తాను కొనుగోలు చేసిన భూమి కి సంబంధించి నెలకొన్న వివాదంపై పోలీసులను ఆశ్రయించాడు. ఈ వివాదాన్ని పరిష్కరిస్తానంటు రైతు వెంకట్‌రెడ్డి నుండి ఎస్‌ఐ క్రాంతికుమార్ 50వేలు డిమాండ్ చేశాడు. ఈ విషయమై రైతు వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూఛనల మేరకు బుధవారం 40వేల రూపాయలను తీసుకుని వెంకట్‌రెడ్డి మండల కేంద్రానికి వచ్చి ఎస్‌ఐ క్రాంతికుమార్‌కు ఫోన్ చేసి తాను ఉన్న చోటు తెలిపి డబ్బులు తీసుకునేందుకు రావాల్సిందిగా కోరాడు. ఎస్‌ఐ క్రాంతికుమారు తనకు బదులుగా హోంగార్డు అబ్ధుల్ గఫార్‌ను పంపిస్తున్నట్లుగా తెలిపి రైతు వద్ధకు అతడిని పంపించాడు. స్థానిక చెరుకు బండి వద్ధ ఉన్న రైతు వెంకట్‌రెడ్డి నుండి నుండి హోంగార్డు గఫార్ 40వేలు తీసుకుంటుండగా పొంచి ఉన్న ఏసీబీ అధికారులు గఫార్‌ను లంచం సొమ్ముతో పాటు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం గఫార్‌ను విచారించగా ఎస్‌ఐ క్రాంతికుమార్ ఆదేశాల మేరకే రైతు వెంకట్‌రెడ్డి నుండి తాను డబ్బులు తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారుల ముందు వాంగ్ములం ఇచ్చారు. అనంతరం ఎస్‌ఐ క్రాంతికుమార్‌ను విచారించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ క్రాంతికుమార్, హోంగార్డు గఫార్, చెరుకుబండి నిర్వాహకుడు శ్రీచంద్‌పై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్స్ వెంకట్‌రెడ్డి, లింగస్వామిలు ఉన్నారు.