క్రైమ్/లీగల్

బాధ్యతలు చేపట్టిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: సుప్రీం కోర్టుకు నియమితులైన నలుగురు న్యాయమూర్తులు శుక్రవారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వీరి రాకతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిల సంఖ్య 31కి చేరింది. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులున్నారు. ఈక్రమంలో సుప్రీం కోర్టుకు పూర్తి స్థాయి న్యాయమూర్తుల నియామకం పూర్తయింది.
కాగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్నలు కోర్టు నంబర్-1లోని సీజే కార్యాలయంలో శుక్రవారం ప్రమాణ స్వీకారం ద్వారా బాధ్యతల చేపట్టారు. సీజే గొగోయ్‌పై లైంగిక వేదింపుల కేసు విచారణ పూర్తయిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 27 నుంచి 31కి పెంచింది. ఈక్రమంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ గత బుధవారం నాడు నలుగురు న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం తెలుపుతూ వారెంట్లను జారీ చేశారు.