క్రైమ్/లీగల్

కూతురిని కడతేర్చిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకుని కన్న కూతురిని హత్య చేశాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఐదేళ్ల చిన్నారిని తండ్రి దూరం చేయడంతో ఆ కన్నతల్లి కన్నీరు మున్నీరైంది. సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలోని కరన్‌కోట్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. తాండూరు మండలం అల్లాపూర్‌లో గురువారం రాత్రి ఘటన జరిగింది. కరన్‌కోట్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా హక్రాన్ గ్రామానికి చెందిన రాజు స్థానికంగా నివాసం ఉంటూ కోనాపూర్‌లోని శ్రీలక్ష్మి నరసింహ పాలిష్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. హక్రాన్ గ్రామానికి చెందిన సునీతతో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. రాజు, సునీత దంపతులకు ఐదు సంవత్సరాల చిన్నారి కాంచన అలియాస్ మీనాక్షి (5) సంతానం. రాజు కుటుంబం మూడు నెలల క్రితం తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చాడు. భార్యభర్తలు కలిసి స్థానికంగా ఉన్న నాపరాతి పాలిషింగ్ యూనిట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఐదు సంవత్సరాల కూతురు ఉంది. ఇటీవల తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కూతురు తనకు పుట్టలేదని అనుమానంతో భార్యను తరచు వేధించాసాగాడు. ఈ విషయంలో తరుచు భార్యతో గొడవ పడుతూ కూతురిని చంపేస్తానని బెదిరించేవాడు. అనుమానంతో భార్యపై కక్షా పెంచుకుని గురువారం మధ్యాహ్నం సునీత పాలిషింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న సమయంలో కూతరు మీనాక్షిని బయటకు తీసుకేళ్లాడు. ఈ క్రమంలో యూనిట్‌లో పనిచేస్తున్న తోటి కూలీలతో పాటు యాజమాని చిన్నారిని ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నించారు. తన చిన్నారికి బిస్కెట్లు ఇప్పించడానికి దుకాణానికి తీసుకెళ్తున్నానని తోటి వారితో రాజు నమ్మబలికాడు. చిన్నారిని తీసుకెళ్లిన తండ్రి రాత్రి సమయంలో సమీపంలోని పాలిషింగ్ యూనిట్ సుద్దనీటి గుంతలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రి వరకు తన కూతురు మీనాక్షి, భర్త రాజు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానంలో సునీత బంధువులు, చుట్టు పక్కల ప్రాంతాలోని ఇళ్లలో ఎంత వెతికిన ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం సమీపంలోని పాలిషింగ్ యూనిట్‌లోని సుద్దనీటిలో చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన కూలీలు తల్లి సునీతకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. తద కూతురును భర్త రాజు చంపేశాడని కరన్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్‌ఐ సంతోష్ కుమార్ ఘటన స్థాలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహన్ని శవ పరీక్షల అనంతరం సునీతకు అప్పగించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ భవనం పైనుంచి పడి
ఇద్దరు కూలీల దుర్మరణం

జీడిమెట్ల, మే 24: నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ బెంగాల్, మల్దా, హజరత్‌పూర్, జలాల్‌పూర్ గ్రామానికి చెందిన అహెదుర్ రహ్మాన్ (20) మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తాడు. అబు తాహీర్ (21), మోదుర్ (20) ముగ్గురు నిజాంపేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 186/2లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో పనిచేస్తున్నారు. శుక్రవారం భవనం మూడవ అంతస్థులో ఎస్‌ఆర్‌పీ (స్టాండర్డ్ రూప్ ప్లాట్‌ఫామ్)పై నిలబడి గోడకు ప్లాస్టింగ్ పని చేస్తున్నారు.
సిమెంట్ మాల్ అయిపోగా ఎస్‌ఆర్‌పీ ద్వారా 9వ అంతస్తు నుంచి సిమెంట్ మెటీరియల్ తీసుకుని కిందకు వస్తున్నారు. ఎస్‌ఆర్‌పీ మిషన్ 8వ అంతస్తుకు రాగానే ప్రమాదవశాత్తు మిషన్ వైర్ స్టాండుకు తగిలి మిషన్ రివర్స్ అయి అందులో ఉన్న ముగ్గురు కూలీలు కింద పడిపోయారు.
తీవ్ర గాయాలకు గురైన అహెదుర్ రహ్మాన్, అబు తాహీర్ మృతిచెందగా గాయాలకు గురైన మోదుర్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సీసీ కెమెరాలు ప్రారంభం
బాలాపూర్, మే 24: సీసీ కెమెరాలు మూడో కన్నులాగా నిరంతరం రక్షణ కల్పిస్తున్నాయని, చాలా వరకు నేరాలు అదుపులోకి వస్తున్నాయని బడంగ్‌పేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బాలాపూర్ మండలం శ్రీవెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చిగురింత నర్సింహా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని బాలాపూర్ సీఐ సైదులు, టీపీసీసీ కార్యదర్శి వంగేటి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. చిగురింత మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం సభ్యుల కోరిక మేరకు తనవంతు సహాయంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.లక్ష విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జంగయ్య, కాలనీ అధ్యక్షుడు కాంత రెడ్డి, కృష్ణ, నరహరి, సంజీవ, గోపాల్ పాల్గొన్నారు.