క్రైమ్/లీగల్

నేరాలను అరికట్టేందుకే సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, మే 25: నేరాలను అరికట్టేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలుపగా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే శామీర్‌పేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ వెల్లడించారు. శనివారం బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో రూపాయలు 10లక్షల 60వేలతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, కలెక్టర్ అనితరామచంద్రన్‌లు ప్రారంభించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నరహంతకుడు శ్రీనివాస్‌రెడ్డి చేతిలో అత్యాచారానికి గురైన శ్రావణి, మనీష, కల్పనల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి అందించాల్సిన సహాయాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. మాచన్‌పల్లి నుండి అటు ఈసీఐఎల్, ఇటు భువనగిరికి అదనంగా బస్సు సౌకర్యాలను కల్పిస్తామన్నారు. విద్యార్థులు భయాన్ని విడిచి సక్రమంగా కళాశాలలు, పాఠశాలలకు వెళ్లాలన్నారు. అత్యాచారం అనంతరం బాలికలను పూడ్చిపెట్టిన తెట్టెబావి, మర్రిబావిలను పూడ్చివేస్తామన్నారు. ప్రజల సహకారంతో బొమ్మలరామారం మండలంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపడుతాన్నారు. కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, డీసీపీ భుజంగరావు, సీఐ సురేందర్‌నరెడ్డి, ఎస్సై మధుబాబు, గ్రామ సర్పంచ్ తిరుమల కవిత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.