క్రైమ్/లీగల్

న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, మే 25: సమాజంలోని సామాన్యుడికి న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించేలా పనిచేయాలని న్యాయం కోసం వచ్చేవారికి న్యాయం అందించాలన్న లక్ష్యంతో మనమంతా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్.చౌహాన్ అభిప్రాయపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జిల్లా కోర్టుకు విచ్చేశారు. న్యాయమూర్తితో మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. అనంతరం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు కావల్సిన అంశాలను పరిశీలిస్తామన్నారు. 33సంవత్సరాల అనుభవంలో ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటకలో పనిచేసిన అనుభవం ఉందని దాని ప్రకారం సమస్యలను పరిష్కరించి న్యాయవ్యవస్థను పటిష్టపర్చేలా ముందుకు వెళ్తామన్నారు. ఇందుకు న్యాయమూర్తులతో పాటు న్యాయవాధుల సహకారం కూడా అవసరమని ఆయన పెర్కోన్నారు. అలాగే సుప్రీంకోర్టు పెర్కోన్న విధంగా 2014వరకు ఉన్న కేసులన్ని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తుల సహకారం ఒక్కటే కాకుండా న్యాయవాధులు కూడా కేసుల సత్వర పరిష్కారానికి సహకరించాలన్నారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో 41వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. సమస్యలు ఎవైన జిల్లా న్యాయమూర్తి ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన న్యాయవాదులను కోరారు. సమస్యల పరిష్కారానికి సమయం పట్టొచ్చెమోకానీ పరిష్కారం చేయడం మాత్రం తప్పక జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టు చిన్నదిగా ఉందని నూతన కోర్టు భవన నిర్మాణానికి పది ఎకరాలు కేటాయించారని అదికూడా సరిపోదని ఖచ్చితంగా జిల్లా కోర్టుకు 35 ఎకరాల స్థలం అవసరమని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా బార్ అసోసియేషన్, జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పక్షన పలు సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు రిజిష్టర్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం న్యాయమూర్తులు అజిజ్, కృష్ణరావు, రఘురాం తదితరులు పాల్గొన్నారు.