క్రైమ్/లీగల్

ఈశాన్య రాష్ట్రాల్లో జేఎంబీ శాశ్వత స్థావరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తలా, మే 25: దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఉగ్రవాద సంస్థ జమాతే-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) పావులు కదుపుతోంది. అయితే, ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందుకు తగిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో గల ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు 10 కిలోమీటర్ల పరిధిలోనే జేఎంబీ టెర్రరిస్టు సంస్థ శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుపుతూనే ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ పీయూష్ గోయల్ పేరిట ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ‘దక్షిణ భారతదేశంలో తమ కార్యకలాపాలు (నెట్‌వర్క్)ను విస్తృతం చేసే దిశగా జమాత్-ఉల్-ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ విశ్వప్రయత్నాలు చేస్తోంది’ అని పేర్కొంది. జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ లేదా జమాత్-ఉల్-హిందూస్తాన్ ఇండియన్ లేదా జమాత్-ఉల్-ముజాదీన్ హిందూస్తాన్ టెర్రరిస్టు సంస్థ ప్రస్తుతం ఉన్న 41 ఉగ్రవాద సంస్థల జాబితాలో ఒకటిగా ఉంది. ఈ సంస్థలన్నింటిపై 1967 చట్టవ్యతిరేక కార్యకలాపాల కింద ఇంతకుముందే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. జేఎంబీ, దాని అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్న జమాతే-ఉల్-ముజాహిదీన్ హిందూస్తాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు వీలుగా భారత్‌లో యువకులను ఎన్నో రకాలుగా ఆకట్టుకుంటోంది. ఇందుకు వీలుగా నిధుల సమీకరణతోపాటు టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం, బాంబు విధ్వంసాలు, అధునాతన పరికరాల ద్వారా పేలుళ్లకు పాల్పడడం వంటి అకృత్యాలకు పాల్పడేందుకు పావులు కదుపుతోంది. ఇదిలావుండగా, జేఎంబీ సహా మిగిలిన టెర్రరిస్టు గ్రూపులు తమ కార్యకలాపాలను విస్తృతం చేయకుండా పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో అనుమానిత ఉగ్రవాది నాజిర్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నామని త్రిపుర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అఖిల్ కుమార్ శుక్లా తెలిపారు. అదేవిధంగా ఎఐఏ, మిలటరీ ఇంటెలిజెన్స్, త్రిపుర స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తగా నాజిర్ షేక్‌ను విచారిస్తున్నామని ఆయన తెలిపారు.