క్రైమ్/లీగల్

బెంగాల్‌లో పెచ్చరిల్లిన హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 25: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం శుక్రవారం రాత్రి, శనివారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలతో హింసాత్మకంగా మారింది. ఈ హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందగా, అనేక మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో బాగా పుంజుకున్న బీజేపీ కార్యకర్తల మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలు తమ పార్టీకి చెందిన అనేక కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడమో, ధ్వంసం చేయడమో చేశారని టీఎంసీ ఆరోపించింది. కూచ్‌బిహారిలోని సిటాయి, ఉత్తర 24 పరగణాలలోని టాటాగఢ్, కోల్‌కతాకు సమీపంలోని న్యూటౌన్ ప్రాంతంలో బీజేపీ మద్దతుదారులు టీఎంసీ కార్యకర్తలను కొట్టారని పోలీసు వర్గాలు తెలిపాయి. కూచ్‌బిహారిలోని బక్షిర్‌హట్, మహిశ్‌కుచి, రాంపూర్, షల్బరిలలో గల తమ పార్టీ కార్యాలయాలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని టీఎంసీ ఆరోపించింది. కూచ్‌బిహారి జిల్లాలోని సిటాల్‌కుచి ప్రాంతం లో గల తమ కార్యాలయాన్ని కూడా బీజేపీ కార్యకర్తలు కొల్లగొట్టారని టీఎంసీ ఆరోపించింది. ‘ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేయడమో, వాటిని ధ్వంసం చేయడమో, తగులబెట్టడమో చేశారు’ అని టీఎంసీ సిటాల్‌కుచి బ్లాక్ అధ్యక్షుడు ఆబెద్ అలీ మియా తెలిపారు. కూచ్‌బిహారి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నిశిత్ ప్రామాణిక్ టీఎంసీ అభ్యర్థి పరేశ్ అధికారిని ఓడించారు. మరోవైపు, ఈ జిల్లాలోని బషీర్‌కుటి ప్రాంతంలో విజయోత్సవ ప్రదర్శన నిర్వహిస్తున్న తమ పార్టీ కార్యలపై టీఎంసీ కార్యకర్తలు కర్రలు, ఈటెలతో దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. సిటాయి ప్రాంతంలోని తమ పార్టీ మహిళా విభాగం నాయకురాలి ఇంటిపై నాటు బాంబులు విసిరారని టీఎంసీ ఆరోపించింది. బంకుర జిల్లాలో కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయి. తమ పార్టీ స్థానిక నాయకుడిపై కాల్పులు జరిపారని బీజేపీ ఆరోపించింది. సల్టోరా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. బీజేపీ నాయకుడు బిద్యుత్ దాస్ (42) విజయోత్సవ ర్యాలీకి నేతృత్వం వహిస్తుండగా ఈ దాడి జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వివేకానంద పాత్ర తెలిపారు. పోలీసుల సమక్షంలోనే స్థానిక టీఎంసీ నాయకుడు కాళిరాయ్ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించినట్టు బంకుర ఎస్‌పీ కోటేశ్వర్ రావు తెలిపారు.
నాడియా జిల్లాలోని చక్‌దహ పట్టణంలో శుక్రవారం రాత్రి 23 ఏళ్ల బీజేపీ కార్యకర్తను కాల్చి చంపారు. ఈ ఘటన వెనుక టీఎంసీ హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భానగర్‌లోని అనేక మంది సీపీఐ(ఎం) మద్దతుదారుల ఇళ్లపై టీఎంసీ కార్యకర్తలు దాడులు చేసి, దోచుకున్నారని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సుజన్ చక్రవర్తి తెలిపారు.