క్రైమ్/లీగల్

భవిష్యత్ బుగ్గిపాలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, మే 25: ఇరవై మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసిన సూరత్‌లోని సర్తానా కోచింగ్ సెంటర్ అగ్నిప్రమాదం ఆ కుటుంబాలకు తీరని దుఖాఃన్ని మిగిల్చింది. శనివారం వెల్లడైన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన ముగ్గురు విద్యార్థులు శుక్రవారం నాటి ప్రమాదంలో అశువులుభాసారు.
ప్రమాదంలో మృతుంలదరూ టీనేజర్లే కావడం అత్యంత విషాదం. అందులో 16 మంది విద్యార్థినులు 15-22 ఏళ్ల వయస్సు వారే. అగ్నిప్రమాదంలో మూడున్నర ఏళ్ల వయస్సు చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది.
20 కుటుంబాల్లో కన్నీటి వేదనను మిగిల్చిన కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై సూరత్ పోలీసుశాఖ ప్రతినిధి పీఎల్ చౌదరి మీడియాకు వెల్లడించారు. భార్గవ్ భూటానీ కోచింగ్ సెంటర్ నడుతుపున్నాడు. సూరత్‌లోని తక్షశిల కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో సెంటర్ నడుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే భార్గవ్‌ను అరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు విద్యార్థులు శనివారం విడుదలైన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. యాశ్వి కేడాడియా, మన్సి వర్సానీ. హస్తి సరానీ ట్వెల్త్ బోర్డు పరీక్షలు రాశారు. శనివారం నాడు విడుదలైన బోర్డు పరీక్షల్లో ముగ్గురూ మంచి మార్కులతో ఉత్తీర్ణులైనట్టు ఆయన పేర్కొన్నారు.‘యాశ్వి 67.75 శాతం మార్కులతో సీ1 గ్రేడ్, మన్సి 52.3 శాతం మార్కులతో సీ1 గ్రేడ్, హస్తి 69.39 మార్కులతో బీ 2 గ్రేడ్‌లో పాస్ అయ్యారు’అని పోలీసు అధికారి స్పష్టం చేశారు. మృతుల్లో అత్యంత పిన్నవయస్కురాలు ఇషా కాకాడియా (15). పెద్ద గ్రీష్మా గజేరా(22). మృతుల్లో ఎక్కువ మంది 17-18 మధ్య వయస్కులే కావడం విషాదం. క్రాఫ్ట్ కోర్సులో వారంతా కోచింగ్ తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. మంటలు చుట్టుముట్టేయంతో భయపడి మూడో అంతస్తుపై నుంచి దూకి ఇద్దరు దుర్మణం చెందగా మిగిలిన వారందరూ మంటలకే ఆహుతైపోయారు. కోచింగ్ సెంటర్ యజమాని భార్గవ్‌ను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు సూరత్ పోలీస్ కమిషనర్ సతీష్ శర్మ వెల్లడించారు. భవన యజమానులు పరారీలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రమాదంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ స్పందించారు. స్కూళ్లు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లలో ఫైర్ సేఫ్టీపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.