క్రైమ్/లీగల్

భారీగా గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 25: ప్రాణాలకు హాని కలిగించే, ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలైన గంజాయిని విక్రయిస్తూ విద్యార్థులు, యువతను చెడగొడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్, ప్రొహిబిషన్ ఉప్పల్ స్టేషన్ అధికారులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.14లక్షల విలువైన 102 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా రేగొండ కొత్తుపల్లిగోరి గ్రామానికి చెందిన పీ.సంపత్ (34), మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన సీహెచ్.యాకయ్య (35) మరో ఇద్దరు దాసరి మణికంఠ రాజులు, చలంశెట్టి సాయి శివలు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నిషేధించబడ్డ గంజాయిని తెచ్చి హైదరాబాద్ ఉప్పల్, మేడిపల్లి, ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాలలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు విక్రయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. మాయ మాటలతో మత్తెక్కిస్తూ చెడుదారికి పట్టిస్తున్నారు. వీరిపై గట్టినిఘా పెట్టి కొందరిని అదుపులోకి తీసుకోగా తాజాగా అందిన సమాచారం ప్రకారం.. పై ఇద్దరు సంపత్, యాకయ్యలను అరెస్టు చేసి శనివారం కోర్టుకు రిమాండ్ చైసినట్లు విలేఖరుల సమావేశంలో ఎక్సైజ్ సూపరిండెంట్ ప్రదీప్ రావు తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.