క్రైమ్/లీగల్

అమేథిలో స్మృతి ఇరానీ అనుచరుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథి, మే 26: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ముగిసి వారం రోజులు కాకుండానే ఉత్తరప్రదేశ్ దారుణం చేసుకొంది. అమేథి నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన స్మృతి ఇరానీ ముఖ్య అనుచరుడొకరు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. అమేథిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓడిపోయిన తరుణంలో ఈ హత్య వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయోమోనన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదనపు ఎస్పీ దయారాం కథనం మేరకు.. బరౌలియా గ్రామంలో రాత్రి 11.30 ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు గ్రామ పెద్ద అయిన సురేంద్ర సింగ్ ఇంట్లోకి చొరబడి ఆయన్ను దారుణంగా హతమార్చారు. కొన ఊపిరితో ఉన్న సింగ్‌ను లక్నో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హత్యాకాండ వెనుక రాజకీయ కుట్రలు ఉండొచ్చని భావిస్తున్నామనీ.. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించగలిగామనీ.. మరో 12 గంటల్లో ఈ ఘటన వెనుక ఉన్న నిందితులను పట్టుకొని తీరుతామని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రకాష్‌సింగ్ వెల్లడించారు. హత్యోదంతం వెనుక ఉన్న అన్ని కోణాలపై దర్యాప్తు చేస్తామని డీజీపీ తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య మాట్లాడుతూ ‘సింగ్ హత్యతో పార్టీ కోసం కష్టపడి పనిచేసే ముఖ్యమైన కార్యకర్తను తాము కోల్పోయామనీ.. ఇది విచారకరం.. దురదృష్టకరం’ అని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సింగ్ హత్యతో యావత్ అమేథీ నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకొన్నాయనీ.. హంతకులు ఎక్కడ ఉన్నా పట్టుకొని తీరుతామని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావు లేదనీ.. హంతకులపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర మంత్రి రీతా బహుగుణ జోషి స్పష్టం చేశారు. అమేథీ ఇన్‌చార్జి మంత్రి మోహ్‌సిన్ రజా హతుడు సింగ్ ఇంటిని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. సింగ్ నిద్రిస్తుండగా కాల్చి చంపారనీ, ఇది చాలా దారుణం, హేయం అన్నారు. రాజకీయ కారణాలతో పాటు పాత కక్షలు కూడా ఉన్నాయేమోనన్న అనుమానాన్ని అమేథీ ఎస్పీ వ్యాఖ్యానించారు.