క్రైమ్/లీగల్

లక్షద్వీప్ దిశగా ఐసిస్ టెర్రరిస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మే 26: శ్రీలంక నుంచి 15 మంది ఐసిస్ ఉగ్రవాదులు బోట్‌లో లక్షద్వీప్ దీవుల వైపు వస్తున్నారన్న వార్తలపై ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ వార్తల నేపథ్యంలో కేరళ తీరప్రాంతం అప్రమత్తమవుతోంది. ఐసిస్ ఉగ్రవాదులు బోటులో తరలివస్తున్నారన్న హెచ్చరికల నేపథ్యంలో కేరళ రాష్ట్రంలోని తీరప్రాంత పోలీస్ స్టేషన్లుతోపాటు, తీరప్రాంత జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమైనట్టు ఆయా వర్గాలు తెలిపాయి. ‘ఇలాంటి హెచ్చరికలు మాకు సర్వసాధారణమే. అయితే, ఈసారి ఎక్కువమంది టెర్రరిస్టులు తరలివస్తున్నారన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లు, అయా జిల్లాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేశాం. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను, అనుమానిత వస్తువుల పట్ల దృష్టి సారించాలని సూచించాం’ అని ఒక పోలీస్ ఉన్నతాధికారి పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. ఐసిస్ టెర్రరిస్టులు బోట్‌లో తరలివస్తున్నారన్న సమాచారం ఈనెల 23నే శ్రీలంక నుంచి తమకు అందిందని ఆయన పేర్కొన్నారు. తీరప్రాంతంలో చేపలు పట్టేవారికి ఈ విషయం గురించి హెచ్చరించామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, లేదా అనుమానిత వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పామని ఆయన తెలిపారు. శ్రీలంకలో ఇటీవల వరుస బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో కేరళ మరింత అప్రమత్తమైంది. శ్రీలంకలో ఈ ఏడాది ఏప్రిల్ 21న ఎనిమిది చోట్ల జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 250 మందికి పైగా పౌరులు మరణించారు. ఈ దారుణానికి ఒడిగట్టిందని తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఐసిస్ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఆస్కారం లేకుండా తిప్పికొట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని ఎన్‌ఐఏ దర్యాప్తు సంస్థ ఇక్కడి పోలీస్ ఉన్నతాధికారులకు సూచించింది.
ఇదిలావుండగా, కేరళలోని కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ ఐసిస్ టెర్రిరిస్టులతో సంబంధాలను కొనసాగిస్తున్నారని నిఘా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.