క్రైమ్/లీగల్

కొత్త లోక్‌సభలో 43 శాతం నేరచరితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన వారిలో కనీసం సగం మంది నేర చరితులున్నారు. 2014తో పోల్చుకుంటే ఈ సభకు రానున్న నేరచరితుల సంఖ్య 26 శాతం పెరిగింది. ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్’(ఏడీఆర్) జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తాజాగా మొత్తం 539 మంది లోక్‌సభకు ఎన్నికకాగా ఇందులో 233 పార్లమెంటు సభ్యులు అంటే 43 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందుల్లో అత్యధికులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ద్వారా ఎంపికైన 116 మంది ఉన్నారు. అంటే ఆ పార్టీకి చెందిన మొత్తం ఎంపీల్లో 39 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన 29 మంది ఎంపీలకు నేర చరిత్ర ఉంది. ఆ పార్టీకి ఎన్నికైన మొత్తం ఎంపీల్లో 57 శాతం నేర చరిత్ర కలవారు ఉండటం గమనార్హం. ఇక జెడీయూ నుంచి ఎంపికైన వారిలో 13 మంది (81శాతం), డీఎంకే నుంచి ఎంపికైన వారిలో 10 మంది (43 శాతం), డీఎంసీ నుంచి ఎన్నికైన వారిలో 9 మంది (41 శాతం) వంతున నేర చరితులు ఉన్నారని ‘ఏడీఆర్’ నివేదిక వెల్లడించింది. కాగా 2014లో ఎన్నికైన లోభసభ్యుల్లో 185 మందిపై క్రిమినల్ కేసులు ఉండేవని, అందులో 112మందిపై తీవ్ర నేరారోపణలతో కూడిన కేసులుండేవని మొత్తం సభ్యుల సంఖ్యలో ఇది 34 శాతమని నివేదిక తెలిపింది.
2009 ఎన్నికల అనంతరం కొలువైన లోక్‌సభలో 30 శాతం (162మంది) నేర చరిత్రులు ఉన్నారని ఇందులో 14 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయని తెలిపింది. కాగా తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో దాదాపు 29 శాతం మందిపై అత్యాచారం, హత్య, హత్యా ప్రయత్నం, మహిళల పట్ల అనుచిత ప్రవర్తన వంటి తీవ్ర నేరారోపణలతో కూడిన కేసులున్నాయని నివేదిక వెల్లడించింది. 2009తో పోల్చుకుంటే ఈ దఫా లోక్‌సభకు ఎన్నికైన తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 109 శాతం పెరిగిందని తెలిపింది. ఇందులో 11 మందిపై హత్య కేసులున్నాయి. బీజేపీ నుంచి ఎన్నికైన ఐదుగురు, బీఎస్‌పీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్, ఎన్‌సీపీ, వైఎస్సార్ సీపీల నుంచి, స్వతంత్రుల నుంచి ఒక్కొక్కరు వంతున హత్యానేరం కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి లోక్‌సభకు తాజాగా ఎన్నికైన బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్లకు సంబంధించిన తీవ్రవాద నేరారోపణ కేసు ఉంది. ఆమెను బరిలోకి దించడం ద్వారా బీజేపీ పలు రకాల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలావుండగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు కేసులు ఎదుర్కొంటున్న వారు సైతం ఈ లోక్‌సభలో 29 మంది ఉంటారు. కేరళలోని ఇడుక్కి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన డీన్ కురియాకోస్‌పై 204 క్రిమినల్ కేసులు ఉండటం విశేషం. ఇందులో ఓ వ్యక్తి మృతికి కారకుడైన ‘కల్పబుల్ హోమిసైడ్’, ఒకరి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించడం, చోరీ, నేరం చేయాలన్న దృక్పథం వంటి పలు కేసులున్నాయి.