క్రైమ్/లీగల్

భారత్‌పై కనె్నత్తకుండా చేసేందుకే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏజిమాలా, మే 26: భారత భద్రత, రక్షణను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే పాకిస్తాన్‌లో బాలాకోట్‌పై దాడి చేసి అక్కడి ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని ధ్వంసం చేయడం జరిగిందని ఆర్మీ చీప్ బిపిన్ రావత్ అన్నారు. భారత్‌పై మళ్లీ కనె్నత్తి చూసే సాహాసాన్ని ఉగ్రవాదులు చేయకుండా చేసేందుకు వారిని తుదముట్టించడం జరిగిందని స్పష్టం చేశారు. సమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు సమన్వయంతో పని చేస్తున్నాయని రావత్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి ఎన్‌ఐఎ, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఉమ్మడిగా అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తీవ్రవాదులకు నిధులు మార్గాలన్నింటినీ మూసి వేశాయని రావత్ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ కాశ్మీర్‌లో తీవ్రవాదంపై కూడా మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా కాశ్మీర్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నామని పేర్కొన్న ఆయన ఇటు భద్రతా దళాలు, ఇతర సంస్థలు ఉమ్మడిగా ముందుకు వెళ్ళి ఈ సవాళ్ళను గట్టిగా ఎదుర్కొన్నాయని తెలిపారు. ఈ చర్యల ఫలితంగా కాశ్మీర్‌లో తీవ్రవాదం అదుపులోకి వచ్చిందని, అయితే కాశ్మీర్‌లోయ ప్రాంతంలో మాత్రం అడపాదడపా అలజడులు చెలరేగుతూనే ఉన్నాయన్నారు. ఇక్కడ కూడా తీవ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు గట్టిగా కృషి చేయడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద సంస్థలకు పొరుగు దేశం నుంచి మద్దతు ఉండడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని రావత్ తెలిపారు. ఉగ్రవాదుల ప్రతికూల ప్రచారం కారణంగా ప్రజలు తప్పుదోవ పడుతున్నారని, ఆ పరిస్థితిని కూడా తాము అదుపులోకి తేగలిగామని రావత్ అన్నారు. రాడార్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించినప్పుడు ‘కొన్ని రకాల రాడార్లు మేఘాలు ఉన్న సమయంలో పని చేయవు, ఇందుకు కారణం అన్ని రాడార్లు ఒకే టెక్నాలజీతో పని చేయకపోవడమే..’ అని వివరించారు.