క్రైమ్/లీగల్

టీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, మే 26: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని చెర్కుపల్లి గ్రామంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న పాతకక్షలు శనివారం రాత్రి ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సొంత గ్రామంలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఉద్రిక్తంగా మారింది. గత సర్పంచ్ ఎన్నికలో అప్పటి ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు చిన్నబొస్క ప్రసాద్, మండలి డిప్యూటీ చైర్మన్ నేతిని, అతని ప్రధాన అనుచరుడైన బంటు మహేందర్‌లతో విభేదించి సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందాడు.
దీంతో గ్రామంలో అప్పటినుండి ప్రసాద్, మహేందర్ మధ్య వర్గపోరు పెరిగింది. ఇదిలా ఉండగా శనివారం కొప్పోలు గ్రామానికి చెందిన కప్పల రమేష్, ఆలకుంట్ల రాంబాబులు చెర్కుపల్లి గ్రామానికి పని నిమిత్తం వచ్చారు. అనంతరం వీరు గ్రామం నుంచి బయటకు వెళ్తున్న సమయంలో చిన్నబొస్క ప్రసాద్ వర్గానికి చెందిన 9 మంది దాడిచేసి గాయపర్చారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు కొందరు ప్రసాద్ వర్గం వారిని నిలదీయగా పాతకక్షలతో బంటు మహేందర్ వర్గంపై దాడిచేసినట్టు గ్రామస్థులు పలువురు చెబుతుండగా బంటు మహేందర్ వర్గం వారే కావాలని చినబొస్క ప్రసాద్‌పై దాడి చేస్తున్నట్టు అతడి కుటుంబ సభ్యులు, అనుచరులు ఆరోపించారు. రెండు వర్గాల వారు గ్రామంలో వీధుల వెంట కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి పికెటింగ్ నిర్వహిస్తున్నారు. 20ఏళ్ల క్రితం ఆగిపోయాయనుకున్న గొడవలు ఇన్నాళ్లకు ఒక్కసారిగా భగ్గుమనడంతో గ్రామస్థులు భయాందోళనల మధ్య ఎప్పుడు ఏం జరుగుతోందని బిక్కుబిక్కుమంటున్నారు. ఇదిలా ఉండగా కొప్పోలు గ్రామస్థులపై దాడిచేసినందుకు చిన్నబొస్క ప్రసాద్‌తోపాటు సందీప్, నరేందర్, రమేష్, సురేష్, సతీష్, రాజేష్, ప్రవీణ్, నవీన్‌లపై కేసు నమోదు చేస్తున్నట్టు ఏఎస్సై ఫజిల్‌అలీఖాన్ తెలిపారు. ఇరువర్గాల వారు దూషణలకు పోకుండా శాంతియుతంగా ఉండేందుకు సీఐ క్యాస్ట్రోరెడ్డి ఇరువర్గాల పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.