క్రైమ్/లీగల్

మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 26: మామిడితోటలో ఉన్న నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన ఫరూఖ్‌నగర్ మండలం ఉప్పరిగడ్డతండా సమీపంలో చోటు చేసుకుంది. షాద్‌నగర్ సీఐ శ్రీ్ధర్‌కుమార్ కథనం ప్రకారం ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఫరూఖ్‌నగర్ మండలం ఉప్పరిగడ్డ తండా సమీపంలో ఉన్న శ్రీనివాస్‌రావు మామిడితోటలో గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు వివరించారు. విజయ్‌కుమారు అనిల్ (15), తేజ (13) అనే ఇద్దరు చిన్నారులు హైదరాబాద్‌లోని చైతన్య పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో తల్లిదండ్రుల వద్దకు చిన్నారులు వచ్చారు. శనివారం యథావిధిగా తల్లిదండ్రులు మామిడితోటలో పనులు చేసేందుకు వెళ్ళగా ఇంటి వద్ద ఉన్న చిన్నారులు క్రికెట్ ఆడుకుంటూ సమీపంలో ఉన్న నీటి సంప్‌లో పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మృతుల తండ్రి విజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీ్ధర్‌కుమార్ తెలిపారు.

పార్కు స్థలం
ఆక్రమణపై కేసు

శేరిలింగంపల్లి, మే 26: పార్కు స్థలంలో మట్టి పోసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. చందానగర్ పోలీసులు, ఫిర్యాదుదారు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చందానగర్‌లోని గౌతమీ నగర్‌లో ఉన్న పార్కు స్థలంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా మొవ్వ సత్యనారాయణ మట్టి నింపుతున్నారని పేర్కొంటూ పోలీసులకు గౌతమీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు కసిరెడ్డి భాస్కర రెడ్డి ఫిర్యాదు చేశారు. హైకోర్టు పిల్ నెంబర్ 62/2018 ద్వారా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధిక్కారించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనపై భారత శిక్షాస్మృతి చట్టం 447 ప్రకారం చందానగర్ ఇన్‌స్పెక్టర్ బీ.రవీందర్ దర్యాప్తు చేస్తున్నారు.