క్రైమ్/లీగల్

గంజాయి ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జూన్ 11: అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఐదు లక్షల రూపాయల విలువ చేసే 82 కిలోల గంజాయి, రూ.30 వేల నగదు, ఏడు మొబైల్ ఫోన్‌లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొండల్ పాత నేరస్తుడు కావడంతో జైలు శిక్ష అనుభవించి ఇంటి వద్ద ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే అక్రమంగా గంజాయి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తూ జైలుకు వచ్చిన తేజ, వినోద్ సింగ్, చిన్న, నాగార్జునతో పరిచయం పెంచుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తరలిస్తూ నగరంలో విక్రయిస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. ధూల్‌పేట్ ప్రాంతంలో విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్నట్లు పక్క సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎస్‌ఓటీ, మీర్‌పేట్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.