క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, జూన్ 11: రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి యాచారం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తక్కళ్లపల్లి తండాకు చెందిన వర్త్యావత్ హనుమ (60) కూలిపనులు చేస్తున్నాడు. రోజులానే పనినిమిత్తం ఇంటి నుంచి బయటికి వచ్చి సాగర్ రహదారిపై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ సంఘటనలో తలకు తీవ్రగాయాలైన హనుమ అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనం దారుడికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.