క్రైమ్/లీగల్

ప్రేమ పేరుతో మోసం చేస్తున్న కి‘లేడీ’ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 11: సినిమాలు, టీవీ సిరియల్స్, క్రైం కథనాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయనడంతో సందేహం లేదు. టెలివిజన్‌లో వచ్చే క్రైం కథనాలను చూసిన కొందరు మంచివారిగా మారితే ఇంకొంతమంది కిల్లర్‌గా మారుతున్నారు. మాట్రిమోనీ మోసాలను టీవీలో చూసిన యువతి కిల్లర్‌గా మారింది. ఉన్నత చదువు చదివిన యువతి మాట్రిమోనీలో జరుగుతున్న మోసాలను టీవీలో చూసి తను కూడా మోసం చేసి డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది. గతంలో నగరంలో యువకులను మోసం చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపించిన కిలాడి లేడీలో ఎలాంటి మార్పు రాలేదు. డిసెంబర్‌లో జైలు నుండి విడుదలైన ఆరు నెలల్లో 8మంది యువకులను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. చివరికి మోసపోయిన వ్యక్తి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిలాడి లేడీని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి- నెల్లూరుకు చెందిన అర్చన (32) తిరుపతిలో ఎంబీఏ వరకు చదువుకుంది. తల్లిదండ్రులు వివాహం చేస్తే అర్చన భర్త దర్గర నుండి వచ్చేసి నగరంలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటుంది. జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం, యువకులను మోసం చేయడం కోసం వాయిస్ చేంజర్ ఫోన్‌ని అమెజాన్‌లో కోనుగోలు చేసింది. ఈఫోన్‌లో వృద్ధులు, చిన్నపిల్లలు, అమ్మాయి, యువకులుగా వాయిస్ మార్చుకునే సౌకర్యం ఉంది. మాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అందులో కన్నడ టీవీ సీరియల్స్‌లోని హీరోయిన్స్ ఫోటోలు పెట్టి యువకులను ఆకర్షించేది. అనంతరం యువకులతో చాటింగ్ చేస్తు యువకులను మోసం చేసేది. పరిచయం అయిన తరువాత ఫోన్ చేసి ఒకసారి తల్లికి, మరోమారు తండ్రికి ఆరోగ్యం బాగోలేదని చికిత్సకు డబ్బులు కావాలని నమ్మించి అందినంత డబ్బులు లాగేది. తను ఉంటున్న హాస్టల్‌లో పనిచేసే వాచ్‌మెన్లు, వంటవారికి లోను ఇప్పిస్తానని వారి బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకునేది. తల్లిదండ్రుల చికిత్స యువకులను నుండి తీసుకున్న డబ్బులను వాచ్‌మెన్, వంట మనుషులకు సంబంధించిన ఖాతాలలో వేయమని సూచించేదని పోలీసులు తెలిపారు. దుర్గప్రసాద్ అనే వ్యక్తి నుండి లక్షన్నర వసూలు చేయడంతో పాటు ఏదో ఒక కారణంతో తరచూ డబ్బులను అడగడంతో అనుమానం వచ్చి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కిలాడి లేడీని అరెస్టు చేశారు.
గతంలో నగరంలో పలువురు యువకులను మోసం చేయడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. డిసెంబర్‌లో జైలు నుండి విడుదలైన అర్చన 8మందిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితురాలు మోసం చేసిన బాధితులకు పోలీసులు ఫోన్ చేస్తే భయపడి యువకులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.