క్రైమ్/లీగల్

నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జూన్ 11: నీటి తొట్టెలో పడి ఏడాది వయస్సు గల చిన్నారి మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దుబ్బగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. దుబ్బగూడెంకు చెందిన మూడు రమేష్ రెండవ కుమార్తె అభినయ (01) మంగళవారం ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో పడిపోయింది. అభినయ నీటి తొట్టెలో పడిపోయిన విషయాన్ని తల్లితండ్రులు గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తండ్రి బయటకు వచ్చి చూసేసరికి తమ చిన్నారి విగతజీవిగా కనిపించడంతో బోరుమన్నారు. ఈఘటన దుబ్బగూడెంలో విషాదాన్ని నింపింది.