క్రైమ్/లీగల్

యూపీ మాజీ మంత్రి ఇళ్లపై సీబీఐ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతి ఇళ్లపై సీబీఐ బుధవారం దాడులు నిర్వహించింది. అక్రమ మైనింగ్ కేసు నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అమేథీలో ఆయనకున్న మూడిళ్లలో సోదాలు జరిపినట్టు వారు తెలిపారు. అదేవిధంగా అమీర్‌పూర్ జిల్లాలో, న్యూఢిల్లీ తదితర ప్రాంతాల్లోని 11 స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్ హయాంలో మైనింగ్ మంత్రిగా పనిచేసిన ప్రజాపతికి సమాజవాది పార్టీలో బలమైన వర్గం మద్దతు ఉంది. దీంతో ఆయన పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రజాపతి ఒక రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. చిత్రకూట్‌కు చెందిన ఒక మహిళ మైనింగ్ లైసెన్స్ కోసం ప్రజాపతిని ఆశ్రయించింది. అయితే, తనను లైంగికంగా వేధించి పలుమార్లు అత్యాచారం జరిపారని ఆమె ఫిర్యాదు చేయడంతో ప్రజాపతిని పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ లభించకపోవడంతో అతను ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. 2012-16 మధ్యకాలంలో జరిగిన మైనింగ్ లీజుల వ్యవహారాల్లో అనేక అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారి చంద్రకళ ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసు నేపథ్యంలోనే అతని ఆస్తులపై సీబీఐ దాడులు జరిగాయి.