క్రైమ్/లీగల్

గోవా కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి నాయక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: ఓ ఛీటింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ బుధవారం గోవాలోని కోర్టుకు సాక్షిగా హాజరయ్యారు. ఓ ఛీటింగ్ కేసులో వినోద్ దేశాయ్‌ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే సదరు వ్యక్తి తాను లోగడ శ్రీపాద నాయక్ వద్ద పని చేశానని నమ్మించి మోసగించాడు. అయితే గత 10 నుంచి 15 ఏళ్ళుగా దేశాయ్ తనకు తెలుసునని, అప్పుడప్పుడు తన నివాసానికి వచ్చే వాడే తప్ప తన వద్ద ఎప్పుడూ పని చేయలేదని ఆయన చెప్పారు. అయితే దేశాయ్ తండ్రి తన వద్ద పని చేశాడని ఆయన తెలిపారు. ఇలాఉండగా గోవా ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక వ్యక్తి వద్ద నుంచి ఆరు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడన్న అభియోగంతో దేశాయ్‌ని పోలీసులు అరెస్టు చేసి ఛీటింగ్ కేసు నమోదు చేశారు.
ఇందులో భాగంగా తొలుత అడ్వాన్స్‌గా రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదుదారు మెర్విన్ ఫెర్నాండేజ్ ఆరోపించాడు. ఉద్యోగం ఇప్పించలేకపోవడంతో డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఫెర్నాండేజ్ డిమాండ్ చేయడంతో లక్ష రూపాయల చెక్కును దేశాయ్ ఇచ్చాడు. అయితే ఇచ్చిన లక్ష రూపాయల చెక్కు కూడా బౌన్సు అయ్యింది.
ఆ తర్వాత ఫెర్నాండేజ్ ఓల్డ్ గోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. దేశాయ్ తాను లోగడ మంత్రి నాయక్ వద్ద పని చేశానని చెప్పడంతో కోర్టు నాయక్‌ను సాక్షిగా హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. ఈ మేరకు శ్రీపాద నాయక్ పానాజీ కోర్టుకు హాజరై దేశాయ్ తమ వద్ద ఎప్పుడూ పని చేయలేదని చెప్పారు.