క్రైమ్/లీగల్

‘నీట్ పిటిషన్’పై నేడు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: ఇటీవల నిర్వహించిన నీట్(యూజీ)-2019 పరీక్ష రాసిన నలుగురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించడానికి సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. నీట్(యూజీ)-2019 పరీక్షలో అడిగిన అయిదు ప్రశ్నలకు ఆన్సర్ కీ తప్పుగా ఉందని, అందువల్ల ఆ పేపర్‌ను రద్దు చేయవలసిన అవసరం ఉందని అభ్యర్థులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. నీట్ పరీక్షకు హాజరయిన నలుగురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, అజయ్ రస్తోగిలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అంగీకరించింది. హైదరాబాద్‌కు చెందిన కాయతి మోహన్ రెడ్డి, మరో ముగ్గురు విద్యార్థులు న్యాయవాది మహ్‌ఫూజ్ నజ్కీ ద్వారా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తప్పుడు ఆన్సర్ కీని జారీ చేసిందని, దానివల్ల పరీక్ష రాసిన అభ్యర్థుల భవిష్యత్తు అవకాశాలు దెబ్బతిన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌టీఏ ఈ నెల అయిదో తేదీన నీట్(యూజీ) పరీక్షను నిర్వహించింది. ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నలకు అధికారిక ఆన్సర్ కీని మే 29న విడుదల చేసింది.