క్రైమ్/లీగల్

పోంజీపై ఈడీ మనీ లాండరింగ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/బెంగళూరు, జూన్ 14: కర్నాటకలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పోంజీ సంస్థ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. వేలాదిమంది పెట్టుబడిదారులను మోసగించడంతోపాటు ఐఎంఏ జ్యువెల్స్‌తో సంబంధం ఉన్న బెంగళూరులో పోంజీ జోనల్ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) అంటే ఎఫ్‌ఐఆర్‌తో సరిసమానమైన కేసును ఈడీ నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సదరు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేసిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. కర్నాటక పోలీసులు పోంజీ సంస్థపై దాఖలైన ఫిర్యాదును సైతం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిటీ) ఆధ్వర్యంలో విచారించేందుకు ఈడీ పోలీసుల అనుమతి కోరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు అనుగుణంగా ఈ కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను సేకరించడంతోపాటు ఇందులో ప్రమేయం ఉన్న కొంతమంది వ్యక్తులకు సమన్లు పంపనుందని ఆ వర్గాలు తెలిపాయి. మహమ్మద్ మన్సూర్ ఖాన్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఐఎంఏ జ్యుయెల్స్‌పై పెట్టుబడిదారుల నుంచి ఇప్పటివరకు దాదాపు 26 వేల ఫిర్యాదు వచ్చాయని ఈడీ పేర్కొంది. మన్సూర్ ఖాన్ కర్నాటకలోని శివాజీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ నుంచి కూడా 400 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు, అవి తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదిలావుండగా, ఐఎంఏ జ్యువెల్స్, మన్సూర్ ఖాన్‌పై రాష్ట్ర పోలీసులకు సైతం వేలాది ఫిర్యాదు వచ్చాయి. అతని ఆచూకీ తెలియక ఎంతోమంది పెట్టుబడిదారులు, ముఖ్యంగా రుణదాతలు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.