క్రైమ్/లీగల్

మధురలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర (యూపీ): ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర జిల్లా, యమున ఎక్స్‌ప్రెస్‌వేలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. గౌతం బుద్ద నగర్ జిల్లాలోని జెవర్ ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు ఉదయం 9 గంటల ప్రాంతంలో వ్యాగన్-ఆర్ కారులో ఆగ్రా వైపు బయలుదేరారు. అయితే యమున ఎక్స్‌ప్రెస్‌వేలో వేగంగా ఉన్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్‌పైకి దూసుకెళ్ళింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యిందని ఆ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య కుమార్ శుక్లా తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచాడు. మరణించిన వారు: నీరజ్ (25), అనిత (30), విష్ణు (25), కరుణ (22), సురేష్ (25), కాగా 13 ఏళ్ళ బాలిక పేరు తెలియరాలేదు. మరణించిన వారి భౌతిక కాయాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలాఉండగా ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.