క్రైమ్/లీగల్

95 క్వింటాళ్ళ రేషన్ బియ్యం సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంపలగూడెం, జూన్ 16: రేషన్ బియ్యాన్ని మూడు వాహనాల్లో తరలిస్తుండగా మండలంలోని ఊటుకూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక ఎస్‌ఐ సిహెచ్ అవినాష్ తెలిపారు. ఒక లారీ, రెండు వ్యానుల్లో బియ్యం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పీడీఎస్ డీటీ తోకచిచ్చు రామచంద్రరాజు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటనలో ఊటుకూరుకు చెందిన పసుపులేటి శ్రీను, వీర్లపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన పఠాన్ శోభ, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైసర గ్రామానికి చెందిన బడగ శివరామబ్రహ్మంను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ సిహెచ్ అవినాష్ తెలిపారు.