క్రైమ్/లీగల్

కొత్తపేట రౌడీ షీటర్ కిలారు సురేష్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, జూన్ 16: కొత్తపేట పోలీస్‌స్టేషన్ రౌడీషీటర్ కిలారు సురేష్ (27) అలియాస్ బుగ్గలోడు శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. సీవీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జీ లోకోషెడ్ మార్గంలో జరిగిన ఈ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఎంతో మందిని బెదిరించి డబ్బులు గుంజి విలాసాలు, వినోదాలకు ఖర్చు చేసిన సురేష్ తాను ఎంచుకున్న మార్గంతోనే హత్యకు గురయ్యాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే హంతకులు వ్యూహాత్మకంగా జరిపిన ఈ హత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జక్కంపూడి కాలనీ నాలుగో బ్లాక్‌లో నివాసముంటున్న కిలారు సురేష్ పలు కేసుల్లో నిందితుడు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించే సురేష్ దారి దోపిడీలు, దౌర్జన్యాలు నేరపూరిత ప్రవర్తన వల్ల రౌడీషీటర్‌గా రికార్డుల్లోకి కెక్కాడు. కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోనే 37 కేసులున్నాయి. అలాంటి వ్యక్తి రౌడీ మామూళ్ల కోసం బెదిరించసాగాడు. విసిగివేసారిన బాధితులు శనివారం రాత్రి 9 గంటల సమయంలో సురేష్‌ని మద్యం సేవించడానికి రప్పించారు. మద్యం సేవిస్తుండగా మాటల మధ్యలో రౌడీ మామూళ్ల ప్రస్తావన వచ్చింది. ‘నీకు మేమెందుకు డబ్బులు ఇవ్వాలి’ అని ఎదురు తిరిగారు. రెచ్చిపోయిన సురేష్ తన చేతిలో చాకుతో వారిని బెదిరించి వాళ్ల జేబుల్లోని డబ్బులు లాక్కొనేందుకు యత్నించగా ప్రవీణ్, నాగబాబులు ఏకమై తిరగబడ్డారు. సురేష్ చేతిలో చాకు లాక్కున్నారు. సురేష్‌ని కిందపడేసి ఇస్టానుసారంగా విచక్షణారహితంగా పొడిచారు. మెడపై, ఛాతీపై, వీపుపై 9పోట్లు పొడిచారు. అతను నెత్తుటి మడుగులో కొట్టుకుని మృతి చెందాడు. అనంతరం నిందితులు సంఘటనా స్థలం నుండి పరారయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడని సమాచారం అందిన నైట్‌డ్యూటీ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరబాబు విషయాన్ని కొత్తపేట పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హతుడు రౌడీషీటర్ సురేష్ అలియాస్ బుగ్గలోడుగా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్గం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని తల్లి కిలారు లక్ష్మీ తన కుమారుడు హతమార్చిన ప్రవీణ్, నాగబాబులేనని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానితులు గత వారం క్రితం బుగ్గలోడుని చంపేస్తామని బెదిరించడం జరిగిందని ఆ ఇద్దరు తనను చంపేస్తారనే భయాన్ని హతుడు తన తల్లితో చెప్పినట్లుగా ఆమె పోలీసులకు వివరించింది. రౌడీలకే రౌడీగా తయారైన బుగ్గలోడు హత్యకు గురైన విషయం ఆదివారం కొత్తపేట స్టేషన్‌లో రౌడీషీటర్ల కౌనె్సలింగ్‌లో ప్రస్తావన రాగా రౌడీషీటర్లు అంతా పీడ విరగడైందని పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే గవర్నరుపేటలోని సబ్‌జైలులోనే సహచరుడైన మొండేలు బాబ్జి అనే వ్యక్తిని 2014లో హత్య చేసిన సురేష్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. నాలుగు హత్యాయత్నాలు, 37 కేసులున్న బుగ్గలోడు హత్య ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదా? మరేమైన బలమైన కారణాలున్నాయా? పోలీసులు దర్యాప్తులో తేలనుంది. కొత్తపేట సీఐ ఎండీ ఉమర్ ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.