క్రైమ్/లీగల్

సీజే ముందు ఆదివాసీల నిర్బంధం అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీల నిర్బంధం అంశం ఆదివారం నాడు హైకోర్టు ముందుకు వచ్చింది. ఆదివాసీలను అటవీశాఖ అధికారులు నిర్బంధించడంపై ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నివాసం వద్ద విచారణ కొనసాగింది. కొలగొండి గ్రామానికి చెందిన 67 మంది గిరిజనులను ఊరికి దూరంగా ఉన్న వేంపల్లి ఫారెస్టు డిపోలో నిర్బంధించారని , వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ శనివారం నాడు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్‌ను దాఖలుచ ఏశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆదివారం సాయంత్రానికి ఆదివాసీలను తమ ముందు హాజరుపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో 16 కుటుంబాలకు చెందిన పెద్దలను టూరిజం బస్సులో అటవీ అధికారులు హైదరాబాద్ తీసుకువచ్చారు. తొలుతో వారిని సైఫాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఉంచిన తర్వాత అక్కడి నుండి కుందన్‌బాగ్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసానికి తీసుకువచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో విచారణ కొనసాగుతోంది. పిటీషనర్ తరఫున, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎవరినీ బలంవంతగా బంధించలేదని వారి ఇష్టపూర్వకంగానే వచ్చి ఫారెస్టు డిపోలో ఉంటున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఆదివాసీలకు పునరావాసం కల్పించకుండా వారి స్థలాల నుండి ఎలా తొలగిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిర్వాసితులైన 67 మంది ఆదివాసీలను హాస్టల్‌లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ఆదివాసీలకు పూర్తిస్థాయి పునరావాసం కల్పిచే వరకూ వారి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని అన్నారు. ఆదివాసీలను టింబర్ డిపోలో ఉంచడం దారుణమని న్యాయమూర్తి పేర్కొన్నారు. తమను అధికారులు నిర్బంధించారని పేర్కొంటూ ఎలా ఇబ్బందులకు గురిచేశారో ఇద్దరు ఆదివాసీలు వివరించారు. ఆదివాసీల కోసం 91 ఎకరాలను గుర్తించామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఏడాదిలోగా వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వం సరైన న్యాయం చేయకపోతే కోర్టు ధిక్కారణ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని బెంచ్ పేర్కొంది.