క్రైమ్/లీగల్

పబ్‌లో చెలరేగిపోయిన బౌన్సర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, జూన్ 17: పబ్‌లు, క్లబ్‌ల్లో చెలరేగే వివాదాల్లో జోక్యం చేసుకొని భౌతికదాడులు జరగకుండా అడ్డుకోవాల్సిన బౌన్సర్లు చెలరేగి పోయారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని బర్త్‌డే పార్టీకి వచ్చిన యువకులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అమ్నిషియా పబ్‌లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాదితులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలీపురానికి చెందిన కార్తిక్ అతని స్నేహితుని బర్త్‌డే పార్టీని జరుపుకునేందుకు ఆదివారం జూబ్లీహిల్స్‌లోని అమ్నిషియా పబ్‌కు వచ్చారు. ముగించుకొని వాష్‌రూమ్‌కు వెళ్లిన వారితో బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించారు. కారణం ఏమిటని ప్రశ్నిస్తే అద్దాలను ధ్వంసం చేశారని అడ్డదిడ్డంగా మాట్లాడారు. దీంతో తిరిగి కార్తిక్‌తో పాటు అతని స్నేహితులు వాష్ రూమ్‌కు వెళ్లి అద్దాలను పరిశీలించి, అద్దాలు సరిగానే ఉన్నాయి కాదా ఎందుకు తమతో దురుసుగా ప్రవర్తించారని నిలదీశారు. దీంతో వివాదం చెలరేగింది. ఇరువురు తీవ్ర వాగ్వాదానికి దిగారు. రెచ్చిపోయిన బౌన్సర్లు చేతికి అందిన వస్తువులతో యువకులపై దాడి చేశారు. రాడ్‌తో దాడి చేయడంతో కార్తిక్ తలకు తీవ్ర గాయమై రక్తస్త్రావం అయింది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పబ్‌లో జరిగిన అమానుషదాడిని వివరించి చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.