క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 17: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన లతీఫ్ అహ్మద్ ఖాన్(25) డ్రైవర్ నసీరుద్దీన్, ఐచర్ వాహనంలో ఈ నెల 13వ తేదీన ఏపీ రాష్ట్రం తిరుపతికి వెళ్లి అక్కడ మామిడి పండ్లను నింపుకుని 15వ తేదీ ఉట్నూరుకు బయలుదేరి వస్తున్నారు. ఈ క్రమంలో ఐచర్ వాహన టైర్లలో గాలి తక్కువగా ఉండంతో డ్రైవర్ నసీరుద్ధీన్ వాహనాన్ని నెమ్మదిగా తొలుతున్నాడు. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై 44 కిలోమీటర్లు సూచించే సూచిక బోర్డు వదకు చేరుకోగానే వెనుక నుండి వేగంగా వచ్చిన మహారాష్టక్రు చెందిన లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో ఐచర్ వాహనంలో ఎడమ వైపు కూర్చున్న లతీఫ్ అహ్మద్ ఖాన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. జరిగిన ప్రమాదాన్ని మృతుడి సోదరుడు సలీమ్ అహ్మద్ ఖాన్‌కు డ్రైవర్ నసీరుద్దీన్ తెలుపడంతో అతను సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించాడు. మృతుడి కుటుంభీకులు పండ్ల వ్యాపారస్తులు. మృతుడి సోదరుడు సలీమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.