క్రైమ్/లీగల్

2005 ఉగ్రదాడుల కేసు.. నలుగురికి యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జూన్ 18: అయోధ్యలో 2005 నాటి ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రత్యేక కోర్టు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా.. ఒకరిని విడుదల చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు స్థానికులు మృతి చెందగా.. ఏడుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితులు నలుగురూ 2.4 లక్షల చొప్పున జరిమానాను ప్రత్యేక జడ్జి దినేష్ చంద్ర విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురాబ్ చంద్ర అగ్రహారీ మంగళవారం విలేఖరులకు తెలిపారు. దాడుల నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ జరిపిన ఎదురు దాడుల్లో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్ర దాడుల్లో నిందితులకు విధించిన శిక్ష పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు.