క్రైమ్/లీగల్

పట్టపగలు జాతీయ రహదారిపై యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, జూన్ 18: పట్టపగలు 44వ జాతీయ రహదారిపై యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన ఫరూఖ్‌భగర్ మండలం బూర్గుల గేటు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. షాద్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. యువకుడు బుల్లెట్ బైక్‌పై వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి పాన్‌కార్డు, బుల్లెట్‌బైక్ నంబర్ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి (30) అనే యువకుడిగా స్థానిక పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలను తెలియాల్సి ఉంది.