క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, జూన్ 18: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ప్రతేక్ష్య సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని మాచన్‌పల్లి గ్రామానికి చెందిన ఎలికే అశోక్(55) సర్దర్‌నగర్ సంతకు వెళ్లి ఇంటికి అవసరమైన కూరగాయాలు తీసుకొని వెళ్తుండగా ఆస్పలిగూడ స్టేజీ దగ్గర బైకు అదుపు తప్పి పడిపోవడంతో అతని తలకు గట్టిగా దెబ్బతగలడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

విద్యార్థి అదృష్యం
షాబాద్, జూన్ 18: మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన మైసని మహేష్(17) ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఎండకాలం సెలవుల అనంతరం ఈనెల 15న ఉదయం పాఠశాలకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వచ్చాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదని తండ్రి మైసని కిష్టయ్య మంగళవారం షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని షాబాద్ ఎస్సై రవికుమార్ పోలీసులు తెలిపారు.