క్రైమ్/లీగల్

మై హోం సిమెంట్ పరిశ్రమలో ఇద్దరు కార్మికుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, జూన్ 18: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలోని మైహోం సిమెంటు పరిశ్రమలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పరిశ్రమ లోపల సిమెంటు తయారీకి ఉపయోగించే క్లింకర్, మట్టి సమపాళ్లలో పంపించే యంత్రం వద్ద ఎర్రమట్టి పేరుకు పోయింది. పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామానికి చెందిన తాళ్లూరి లక్ష్మీనారాయణ (45), మేళ్లచెర్వు మండలం వేపల మాధవరం గ్రామానికి చెందిన బడే సాహెబ్ (43) యంత్రంలోకి దిగారు. అయతే పేరుకుపోయిన మట్టి ఒక్కసారిగా కార్మికులపై పడటంతో ఊపిరి ఆడక వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మట్టిని తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో వెంకట్‌రెడ్డి అనే కార్మికుడు బయటపడ్డాడు. ఇదిలా ఉండగా ఘటనా స్థలానికి కోదాడ రూరల్ సీఐ రవికుమార్ చేరుకుని ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.