క్రైమ్/లీగల్

జబర్దస్త్ చలాకీ చంటికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జూన్ 18: జబర్దస్త్ నటుడు చలాకీ చంటికి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివారులోని కొమరబండలో 65వ జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొని గాయపడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం నుండి హైద్రాబాద్‌కు కారులో చంటి వెళ్తున్నాడు. ఆయన కారుకు ముందుగా వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుకనుండి ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న చంటి, ఆయన కారు డ్రైవర్ శివకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.