క్రైమ్/లీగల్

ఆలయాల్లో పేలుళ్లకు కుట్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూర్, జూన్ 19: కేరళలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ వివిధ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు ఉగ్రవాదులు పనే్న కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆలయాలతోపాటు చర్చిల్లోనూ ఆత్మాహుతి దాడులు జరిపేందుకు చేసిన వ్యూహాన్ని తిప్పికొట్టారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సానుభూతిపరులుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం..షాజహాన్, మహమ్మద్ హుసేన్, షేక్ సైఫుల్లా అనే ముగ్గురు ఉగ్రవాదులను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఆలయాలు, చర్చిల్లో ఆత్మాహుతి దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను చూస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని దేవాలయాలు, చర్చిల్లో శ్రీలంకలో జరిగిన దాడుల రీతిలోనే ఆత్మాహుతి దాడులకు దిగాలని వీరు ప్రణాళిక వేశారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.